ప్రజాశక్తి -మధురవాడ : అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. 8వ వార్డు పరిధి ఎండాలో 7, 8వార్డుల పరిధిలో ఉన్న అర్హులకు రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి మాట్లాడుతూ, 872 మందికి పట్టాలను అందించమన్నారు. మిగిలిన సచివాలయ ప్రాంతాల్లో గడపగడపకు తిరుగుతానని, ఎవరైనా అర్హులుంటే ఇళ్ల పట్టాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అవుతుందన్నారు. అనంతరం రూ.40 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు కార్పొరేటర్ లోడగల అప్పారావు, అల్లాడు ఉమామహేశ్వరరావు, గుడ్ల పోలిరెడ్డి, గోపి, పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, పిళ్లా సూరిబాబు, గుడికి రామారావు, రజిని, తహశీల్దార్ పాల్ కిరణ్, జోన్ 2 జెడ్‌సి బి.రాము తదితరులు పాల్గొన్నారు.










