కడప అర్బన్ : అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చే లక్ష్యంతో ప్రజలకు సంతప్త స్థాయిలో ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని కలెక్టర్ వి.విజరు రామరాజు పేర్కొన్నారు. గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి అర్హులై ఉండి పలు కారణాలతో సంక్షేమ పథకాల లబ్ధి పొందలేకపోయిన వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసే 'బై యానువల్ శాంక్షన్' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విసి ద్వారా బటన్ నొక్కి ప్రారంభించారు. కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ విసి హాలు నుంచి కలెక్టర్‌తోపాటు జెసి గణేష్ కుమార్, కడప నగర మేయర్ సురేష్ బాబు, రాష్ట్ర ఉద్యాన శాఖ సలహాదారు పి. శివ ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య హాజరయ్యారు. ముఖ్యమంత్రి విసి ముగిసిన 7,996 మంది లబ్దిదారులకు ప్రభుత్వం విడుదల చేసిన రూ.11.11 కోట్లకు సంబందించిన మెగా చెక్కును కలెక్టర్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మ్మఒడికి సంబంధించి 798 మందికి గాను రూ.1.19 కోట్లు, చేదోడు కింద 1,919 మందికి రూ.1.91 కోట్లు, ఇబిసి నేస్తం నుండి 509 మందికి రూ.76.39 లక్షలు, నేతన్న నేస్తం ద్వారా నుండి 69 మందికి రూ.16.56 లక్షలు, 0 వడ్డీ పంట రుణాలను సంబంధించి 916 మందికి రూ.1.12 కోట్లు, విద్యా దీవెన కింద 1,918 మందికి గాను రూ.3.39 కోట్లు, వసతి దీవెన కింద 1,424 మందికి రూ.1.38 కోట్లు, మహిళా సంఘాలకు మూడు విడతల్లో 443 సంఘాల సభ్యులకు రూ.1.27 కోట్లు... కలిపి మొత్తం 7,996 మంది లబ్దిదారులకు గాను రూ.11,11,47,871లు విడుద లయిందన్నారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జిల్లాలో సంతప్త స్థాయిలో అమలవుతున్నాయన్నారు. కార్యక్రమంలో జడ్‌పిసిఇఒ సుధాకర్ రెడ్డి, డిఆర్‌డిఎ, మెప్మా పీడీలు ఆనంద్ నాయక్, సురేష్‌కుమార్, ఎస్‌ఎస్‌ఎ పిఒ డాక్టర్ ఎ. ప్రభాకర్‌రెడ్డి, డిఇఒ రాఘవరెడ్డి, ఆర్‌ఐఒ రమణ రాజు, లబ్ధిదారులు పాల్గొన్నారు.మెగా చెక్కును అందజేస్తున్న కలెక్టర్










