బి.కొత్తకోట : వైసిపి పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని పిటిఎం మండలం కట్నగల్లు రామాలయం గుడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సచివాలయ పరిధిలోని గ్రామాల్లో నిర్వహించిన పల్లెబాట కార్యక్రమాలోల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికి అందు తున్నాయని అన్నారు. ప్రత్యేకంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎనలేని సేవలు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా కుల, మతాలకతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి తమ మద్దతు తెలిపాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిడిఒ గిరిధర్ రెడ్డి, ఎంపిపి మహమ్మద్, జడ్‌పిటిసి శివన్న, కొండా సిద్ధార్థ, మాజీ ఎంపిటిసి రమణ, వైసిపి జిల్లా ప్రచార కార్యదర్శి అయూబ్ బాషా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










