
ప్రజాశక్తి- కశింకోట
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ జగనన్న నవరత్న పథకాలను అందజేస్తున్నామని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. కశింకోట సచివాలయం-3 పరిధిలోని దాడివీధి, వేలంపేట, పెద్ద గుమ్మం వీధిలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసిపి విజయం ఖాయమని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా అధికార ప్రతినిధి మళ్ళ బుల్లి బాబు, మండల అధ్యక్షులు మలసాల కిషోర్, జెడ్‌పిటిసి దంతులూరి శ్రీధర్ రాజు ఎంపీపీ కలగా లక్ష్మీ గున్నయ్య నాయుడు, వైస్ ఎంపిపి పెంటకోట జ్యోతి శ్రీనివాసరావు అనకాపల్లి ఎమ్‌పిపి గొర్లి సూరిబాబు, రాష్ట్ర వాటర్ వాస్ అధారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, ఎంపిడిఓ రవికుమార్, తహశీల్దార్ సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ మంత్రి జయరజనీ, అధికారులు పాల్గొన్నారు.
సమస్యలపై మంత్రి అమర్‌నాథ్‌కు వినతి
కసింకోట : కశింకోట మండలంలో సమస్యలపై రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు సిపిఎం నాయకులు డిడి.వరలక్ష్మి, దాకారపు శ్రీనివాసరావు వినతి పత్రం అందజేశారు. కశింకోటలోని పెద్ద గుమ్మం వద్ద శారదా నదిపై రైతులు రాకపోకల నిమిత్తం బ్రిడ్జిని నిర్మించాలని ప్రజల వద్ద సంతకాల సేకరణ చేసిన వినతి పత్రాన్ని అందజేశారు. పెద్ద గుమ్మం వీధి వద్ద శారదా నదిపై ఎడ్ల బండ్లు రాకపోకల నిమిత్తం బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు.