
ప్రజాశక్తి -నక్కపల్లి:అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించినట్లు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. మండలంలోని ఉపమాక పంచాయతీ శివారు సారిపల్లిపాలెంలో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటించారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను లబ్ధిదారులకు అందజేసి, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవా లన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రత్నం, పార్టీ మండల శాఖ అధ్యక్షులు శీరం నరసింహమూర్తి, నక్కపల్లి పిఎసిఎస్ పర్సన్ ఇన్ చార్జి ఎలమంచిలి తాతబాబు, వైసిపి నాయకులు సూరకాసుల గోవింద్, మనబాల తాతారావు ,అధికారులు, సచివాలయం సబ్బంది, వాలంటీర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.