Aug 19,2023 22:16

ఫొటో : పథకాల గురించి వివరిస్తున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ప్రజాశక్తి-కావలి : అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందినప్పుడే వారి జీవితాలు బాగుపడతాయని కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. స్థానిక నవవికాస్‌ వద్ద ఉన్న విఘ్నేశ్వర ఆలయం నుండి శనివారం ''గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం'' చేపట్టారు. గడపగడప కార్యక్రమానికి విచ్చేసిన ఎంఎల్‌ఎకు 22వ వార్డు మాజీ కౌన్సిలర్‌ గంధం ప్రసన్నాంజనేయులు స్వాగతం పలికారు. ప్రతి గడపలో మంగళ హారతులు, ఆప్యాయ పలకరింపులు, డప్పుల శబ్ధాలు, మంగళ వాయిద్యాల మధ్య మహిళలు ప్రతి గడపకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్వరాజ్య స్థాపనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి గ్రామాలలోని ప్రజలకు, పూర్తిస్థాయి సేవలు అందిస్తున్నారన్నారు. సచివాలయ వలంటీర్‌ వ్యవస్థల ద్వారా పేదల ఇళ్ల ముంగిటకే పథకాలు అందిస్తూ, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పారన్నారు.
విద్య, వైద్యం, అభివృద్ధి చెందినప్పుడే ప్రతిఒక్కరూ అభివృద్ధి చెందుతారన్నారు. అనంతరం ఇందిరానగర్‌లోని మున్సిపల్‌ పాఠశాలలో చిన్నారులతో ఆయన ముచ్చటించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని వారిని ఆశీర్వదించారు. విద్యార్థులకు అందుతున్న ''అమ్మఒడి'' పథకంపై ఆయన ఆరాదీశారు. అలాగే విద్యార్థులకు అందుతున్న పుస్తకాలు, యూనిఫారం, బోర్డు అలాగే విద్యను గురించి కూడా ఆయన విద్యార్థుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే ఇంగ్లీష్‌ విద్యను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టారని తెలిపారు. అనంతరం పిల్లలకు మధ్యాహ్న భోజనం పిల్లలకు వడ్డించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌ రెడ్డి, అమరా వేదగిరి సుబ్బరాయుడు గుప్తా, 23వ వార్డు మాజీ కౌన్సిలర్‌ కనుపర్తి రాజశేఖర్‌, 1వ వార్డు కౌన్సిలర్‌ పులి చక్రపాణి, పులి రజిని, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నగళ్ల శ్రీనివాస్‌ కిరణ్‌, 29వ వార్డు వైసిపి ఇన్‌ఛార్జి పెనుమల్లి అశోక్‌, 18వ వార్డు ఇన్‌ఛార్జి అబ్దుల్‌ రహీం, షేక్‌.ఆబిద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌, మున్సిపాలిటీ కుందుర్తి కామయ్య, కృష్ణారెడ్డి, 16వ వార్డు పేరం వేంకటేశ్వర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్‌ సిబ్బంది, మెప్మా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.