Jul 19,2023 23:59

గొలుగొండలో ధ్రువపత్రాలు ఇస్తున్న అధికారులు

ప్రజాశక్తి-నక్కపల్లి:అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే బాబూరావు తెలిపారు. పెదదొడ్డిగల్లు సచివాలయం వద్ద జరిగిన జగనన్న సురక్షలోఓ ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమ ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని తెలిపారు. సంక్షేమ ఫలాలను ప్రజల ముంగిటికే అందిస్తున్నామన్నారు. లబ్ధిదారులకు దృవీకరణ పత్రాలు అందజేశారు. నక్కపల్లి సచివాలయం వద్ద జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సీతారామరాజు, తహసీల్దార్‌ అంబేద్కర్‌, ఈఓపిఆర్డీ వెంకట నారాయణ, సర్పంచ్‌లు గొర్ల విజయలక్ష్మి, మున్నీషాబేగం, జయ రత్న కుమారి, మండల పరిషత్తు ఉపాధ్యక్షులు వీసం నానాజీ, ఎంపీటీసీ సభ్యులు గొర్ల దుర్గ, నక్కపల్లి పిఎ సిఎస్‌ చైర్‌ పర్సన్‌ తాతబాబు, నాయకులు శీరం నరసింహ మూర్తి, సూరకాసుల గోవింద, నాగ అప్పలరాజు, గొర్ల గోవింద రాజులు, బాబురావు, వీసం రాజు, బంగారు రాజు పాల్గొన్నారు.
చీడికాడ:ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాలు పథకాలు ప్రజలందరికీ నూరు శాతం అందేటట్లు చూడటమే జగనన్న సురక్ష ధ్యేయమని గ్రామ సర్పంచ్‌ కోడూరు సత్యవతి అన్నారు. చీడికాడ మండలం జైతువరం గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్‌ బివి రాణి మాట్లాడుతూ, జగనన్న సురక్షతో 11 రకాల సేవలను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఎంపీపీ జయమ్మ మాట్లాడుతూ, జగనన్న పరిపాలనలో సంక్షేమ ఫలాలు ప్రజలకు అవినీతి లేకుండా అందుతు న్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయప్రకాష్‌. వైసీపీ నాయకుడు లాలం జానకిరామ్‌ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
కోటవురట్ల:సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల ప్రత్యేక అధికారి ఉదయశ్రీ తెలిపారు. పాములవాకలో తహసిల్దార్‌ జానకమ్మ, అన్నవరంలో ఎంపీడీవో కాశీ విశ్వనాథరావు జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు కిల్లాడ శ్రీనివాసరావు, వైస్‌ ఎంపీపీ దత్తుడు రాజు, పాములవాక సర్పంచ్‌ సత్యవతి, డిప్యూటీ తహసిల్దారు సోమశేఖర్‌, ఈఓపిఆర్డి సుబ్రహ్మణ్యం, వైసిపి నాయకులు అయ్యపురెడ్డి బాబ్జి, శెట్టి ఎర్రంనాయుడు పాల్గొన్నారు.
గొలుగొండ:గొలుగొండ గ్రామంలో సర్పంచ్‌ కసిపల్లి అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన జగనన్న సురక్షలో వ్యవసాయ అధికారి బి.మోహన్‌రావు మాట్లాడుతూ, ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం 11 రకాల దృవపత్రాలను అందజేస్తుందన్నారు. ధృవపత్రాలతో పాటు రేషన్‌ కార్డులను అందజేస్తుందన్నారు. పప్పుశెట్టిపాలెంలో సర్పంచ్‌ మాకిరెడ్డి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జడ్పిటిసి గిరిబాబు, ఎంపిడిఒ డేవిడ్‌రాజులు సుమారు 250 మందికి దృవపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్‌ జి.ఆనంద్‌రావు, ఈఒపిఆర్‌డి రఘురాం, వైసిపి మండల యూత్‌ అధ్యక్షులు మాకిరెడ్డి రామకృష్ణనాయుడు, గొలుగొండ ఎంపిటిసి పాప సిబ్బంది పాల్గొన్నారు.