వీరబల్లి : రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మో హన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని మట్లి పంచాయతీలో సర్పంచ్ నాగార్జునచారి ఆధ్వర్యంలో వై ఎపి నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను స్థానిక నాయకులతో కలిసి ఎగురవేశారు. సచివాలయ పరిధిలో సంక్షేమ పథకాలు అభివద్ధిని వివరించే బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్లి గ్రామ సచివాలయంలోని ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.25.62 కోట్ల మేర లబ్ది చేకూరడం జరిగిందన్నారు. జగనన్నే మా భవిష్యత్.. మా నమ్మకం నువ్వే జగన్' అని ప్రజలు నినది స్తున్నారని చెప్పారు. మాటమీద నిలబడే వ్యక్తిగా ఇప్పటికే జగనన్న మేని ఫెస్టోలో ఇచ్చిన హామీలల్లో ఇప్పటికీ 98 శాతం నెరవేర్చారని చెప్పారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడమని ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా ప్రణాళిక రూపొందించారని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరల జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపిపి రాజేంద్రనాథ్‌రెడ్డి, జడ్‌పిటిసిి శివరాంగౌడ్, వైసిపి నాయకులు వీరనాగిరెడ్డి, విఆర్ విద్యా సంస్థ అధినేత వి ఆర్ రెడీ, బిసిసెల్ నాగభూషణం, సర్పంచులు నాగార్జునఆచారి, నాగిరెడ్డి, నేతి ఆంజనేయులు, గోపీనాథ్‌రెడ్డి, రాజారెడ్డి, కిషోర్ రెడ్డి, సింగల్ ప్రెసిడెంట్ రామానుజన్‌రెడ్డి, రెడ్డి శేఖర్, జెసిఎస్ మండల కన్వీనర్ నరేష్‌స్వామి, రాజారెడ్డి, సర్పంచులు, ఎంపి టిసిలు, సచివాల సిబ్బంది పాల్గొన్నారు.చిన్నమండెం : జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని జడ్‌పి మాజీ వైస్ చైర్మన్ దేవనాథ్‌రెడ్డి అన్నారు. దేవగుడిపల్లి సచివాలయంలో ఆంద్రప్రదేశ్‌కి జగనే ఎందుకు అవసరం కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రజల వద్దకు వెళ్లి నాలుగున్నరేళ్లలో అందించిన సంక్షేమ పథకాలు అభివద్ధి కార్యక్రమాలను వివరించారు. ఏర్పాటు చేసిన సమావేశంలో దేవనాథ్ రెడ్డి మాట్లాడుతూ కుల,మత, రాజకీయాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేసిన సిఎం జగన్‌ను 2024లో మరోసారి గెలిపించుకోవలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ దివ్య,పంచాయితీ సెక్రటరీ సుమిత్రమ్మ సర్పంచ్ అమతమ్మ, ఎంపిటిసి తులసమ్మ, ఉపసర్పంచు శ్రీలత, మండల కన్వీనర్ చుక్క అంజనప్ప, మండల ఉపాధ్యక్షుడు ఎజాష్ అలీ ఖాన్, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ రమణ, డిటి తిమ్మరెడ్డి, టీచర్లు భాస్కర్‌రెడ్డి, రెడ్డెన్న, పార్టీ నాయకులు రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి : అభివద్ధి ,సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మండలంలోని పందిళ్ళపల్లెలో నిర్వహించిన వై ఎపి నీడ్స్ సిఎం జగన్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. నాలుగున్నరేళ్లుగా సంక్షేమ, అభివద్ధి పథకాల ద్వారా రాష్ట్రాన్ని సిఎం వైఎస్ జగన్ ప్రగతిపథంలో నిలపడాన్ని శ్రీకాంత్‌రెడ్డి ప్రజలకు వివరించారు. పందిళ్ళ పల్లె గ్రామానికి చేసిన మంచిని గణాంకాలతో సహా కళ్లకు కట్టినట్లు వెల్లడించి సంక్షేమ పథకాల బోర్డును స్థానిక నాయకులతో కలసి ఆవిష్కరించారు.చంద్రబాబు, పవన్‌లు ఉమ్మడి మేనిఫెస్టోతో వస్తున్నారని, వారికి తగినరీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎంపిపి సంఘం అధ్యక్షుడు మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రాయచోటిని జిల్లా చేయడంతో పాటు, నియోజకవర్గ అభివద్ధికి అహర్నిశలు కషి చేస్తున్నారని అన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో వెలిగల్లు కాలువల ద్వారా లక్కిరెడ్డిపల్లె మండలంలో 80 శాతం చెరువులకు సాగు నీరు నింపి రైతులకు అండగా నిలిచారన్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు సమ రసింహారెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ అమీర్, మాజీ ఎంపిటిసి రాజేంద్రనాథ్ రెడ్డి, సర్పంచులు బాబు, వెంకటనారాయణ రెడ్డిలు పాల్గొన్నారు.