Aug 11,2023 21:13

ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తున్న ప్రభుత్వ విప్‌ కొరముట్ల

పెనగలూరు : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిచడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివా సులు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని సింగారెడ్డిపల్లి గ్రామపంచాయతీలోని కంబల కుంటలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు సంక్షేమ పథకాలు అందు తున్నాయా లేదా అని ఆరా తీశారు. అర్హత కలిగి సంక్షేమ పథకాలు అందకుంటే స్థానిక గ్రామ సచివాలయాన్ని సంప్రదిం చాలని సూచించారు. ప్రజల నుంచి వినతులను, సమస్యలను అధికారుల సమక్షంలో అక్కడికక్కడే పరిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారని అన్నారు. వైసిపి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఆనందంతో ఉన్నారని అన్నారు. విద్యార్థులు, మహిళలు, రైతులు అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. వైసిపికి వస్తున్న ప్రజాధరణ చూసి ఒర్వలేక ప్రతిపక్ష నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పాలన కోసం మరోమారు వై.ఎస్‌.జగన్‌ను మరల ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి కొండూరు విజరురెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజం సుకుమార్‌, తహశీల్దార్‌ శ్రీధర్‌రావు, ఎంపిడిఒ వరప్రసాద్‌, ఎస్‌ఐ హేమాద్రి, సచివాలయ అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు.కలకడ : ప్రజా సంక్షేమం కోసమే గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఏనుగొండపాలెం పంచా యతీ దిగువ పాలెం సచివాలయంలో ఎగువకురవపల్లి, దిగివ పాలెం గుండావాండ్లపల్లి, అవులప్పగారిపల్లి, గుండావాండ్లపల్లి, హరిజనవాడ, మొర్రంమీదపల్లి గ్రామాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి గన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమాన్ని కోరుతున్న ఏకైక ముఖ్యమంత్రిగా దేశంలో నిలిచారన్నారు. కార్యక్రమంలో ఎంపిపి శ్రీదేవి రవికుమార్‌ మండల సచివాలయం కార్యదర్శి మోహన్‌రాజానాయుడు, ఎంపిటిసి ఈశ్వరయ్యనాయుడు, ఎంపిడిఒ పరమేశ్వర్‌రెడ్డి, తహశీల్దార్‌ ప్రదీప్‌ సచివాలయ, పంచాయతీ, వైసిపి నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు.