Sep 14,2023 22:31

ప్రజాశక్తి-గూడూరు : సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తోందని రాష్ట్ర గహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన పెడన నియోజకవర్గంలోని గూడూరు మండలం కంకటావ గ్రామ సచివాలయ పరిధిలోని కంకటావ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా చేకూరుస్తున్న లబ్దిని ఇంటింటికి తిరిగి గ్రామస్తులకు వివరించి చెప్పారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కుల మత ప్రాంత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలను అందిస్తున్నారన్నారు. అనంతరం రూ.61. 80 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. గూడూరు మండలం కంకటావ గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో గ్రామ సచివా లయం, అదేవిధంగా రూ.21.80 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎంపిపి సంగా మధుసూదనరావు, గూడూరు జెడ్పిటీసి వేముల సురేష్‌ రంగబాబు, గూడూరు ఎంపిడిఓ డి సుబ్బారావు, పార్టీ నాయకులు తలుపుల వెంకట కష్ణారావు, బొర్రా దుర్గారావు పాల్గొన్నారు.