ప్రజాశక్తి-గూడూరు : అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందచేస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.ఆదివారం గూడూరు మండలం కంకటావ సచివాలయ పరిధిలోని ఆర్విపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారందరికీ తెలియజేస్తూ ,అర్హులైన వారు ఎవరైనా వుంటే వారికి ఎవరికైనా పథకాలు రాకుంటే అలాంటి వాటికి పరిష్కరించాలంటూ సచివా లయం ఉద్యోగులను ఆదేశించారు. గడపగ డపకు మన ప్రభుత్వం కార్యక్రమం పట్ల ప్రజలు ఎంతో ఆదరణ చూపిస్తున్నారన్నారు. ప్రజలే వారికి అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఎంతో సంతోషంగా వివరాలు తెలియజేస్తూన్నారన్నారు.ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించడం పట్ల ప్రజలు జగనన్న పట్ల అపారమైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్వీపల్లి గ్రామ సర్పంచ్ రాజులపాటి రేణుక జమదగ్ని, గూడూరు ఎంపీపీ సంగా మధుసూదన రావు, జడ్పిటిసి వేముల సురేష్ రంగబాబు, పెడన ఏఎంసీ చైర్ పర్సన్ చారుమతి రామానాయుడు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు, తహసిల్దార్ విజయ ప్రసాద్, ఎంపీడీవో సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.










