Jun 27,2023 21:11

విభిన్న ప్రతిభావంతుడితో మాట్లాడుతున్న శ్రీనివాసులు

పుల్లంపేట : అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దళవాయిపల్లి, కేతరాజుపల్లిలో ఎమ్మెల్యే కొరముట శ్రీనివాసులతో కలిసి ఆయన గడప గడపకూ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల చెంతకే పాలన అందించడం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి సాధ్యమని తెలిపారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తూ దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని పేర్కొ న్నారు. ప్రజల నుంచి వస్తున్న వినతులను సమస్యలను అప్పటికప్పుడే సంబంధిత అధికా రులతో మాట్లాడి పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కొల్లం గంగిరెడ్డి, మండల సచివాలయల కన్వీనర్‌ నాగిరెడ్డి హరినాథరెడ్డి, తహశీల్దార్‌ నరసింహ కుమార్‌, ఎంపిడిఒ రఘురాం, ఇఒపిఆర్‌డి ప్రకాశం, మండల కన్వీనర్‌ సయ్యద్‌ ముస్తాక్‌, జిల్లా టూరిజం డైరెక్టర్‌ సుధాకర్‌ రాజు, డిఎస్‌పి చైతన్య, సిఐ పుల్లయ్య, ఎస్‌ఐ రఘురాం, రైల్వేకోడూరు వైస్‌ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డి, నాయకులు రామనాథం, దలవాయిపల్లి మాజీ సర్పంచ్‌ మల్లికార్జునరెడ్డి, విజరు కుమార్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, రాజారెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.