ప్రజాశక్తి - టి.నరసాపురం
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలందరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు తెలిపారు. మండలంలోని బందంచర్ల గ్రామంలో మంగళవారం నిర్వహించిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్న బాలరాజు ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పారదర్శకంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. సిఎం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధి దారునికి అందజేస్తున్నామన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి, నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి రైతు విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షులు వాసిరెడ్డి మధు, ఎంపిపిడి లక్ష్మి, వైసిపి మండల కన్వీనర్ శ్రీను రాజు, మండల యూత్ అధ్యక్షుడు కన్నం సర్వేశ్వర రావు, ఎఎంసి డైరెక్టర్ బోట్ల విశ్వనాథం, స్థానిక సర్పంచి గుండె వెంకటేశ్వరరావు, కేతవరం సర్పంచి తడికలపూడి శివ మాధవి కిషోర్, దేవరపల్లి సీతారామ ప్రసాద్, కురసం నిరీక్షణరావు పాల్గొన్నారు.










