ప్రజాశక్తి-కంచికచర్ల
రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హత కల్గిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన కంచికచర్లలో జాతీయ రహదారి పక్కన గల వ్యాపారస్థులను కలుసుకున్నారు. వ్యాపార లావాదేవీలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి హయాంలో పెన్షన్ కావాలన్నా జన్మభూమి కమిటీ సిఫార్సు ఉంటేనే అందేవన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్ పాలనలో సమూల మార్పులు తీసుకు వచ్చి, ప్రభుత్వ పథకాలు అందాలంటే అర్హత ఒక్కటే ప్రామాణికంగా పెట్టుకొని, రాజకీయ ప్రమేయం లేకుండా అర్హత కల్గిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేల్పుల సునీత, ఉప సర్పంచ్ వేమా సురేష్ బాబు, కార్యదర్శి కనగాల రవికుమార్, ఆర్‌ఐ శిరీష, యంపిడీఓ కె బాల శంకరరావు, వైసిపి నాయకులు వేల్పల శ్రీనివాసరావు, నారిశెట్టి శ్రీనివాస్, వంగా శ్రీనివాసరావు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.










