Dec 14,2022 22:21

ప్రజాశక్తి -తిరువూరు 

నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 100 రోజులు పూర్తి చేసుకుని బుధవారం తిరువూరు పట్టణానికి వచ్చిన ఎమ్మెల్యే కొక్కిలిగ డ్డ రక్షణనిధికి వైసిపి నాయకులు, కా ర్యకర్తలు ఘనంగా స్వాగతం పలికా రు. ఈసందర్భంగా 100 రోజుల వేడుక నిర్వహించి కేక్‌ కట్‌ చేశారు. ఈసంద ర్భంగా ఎమ్మెల్యే ప్రసంగిస్తూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు కుల, మత, ప్రాంత,రాజకీయ పక్షపాతం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందచే స్తున్నామన్నారు. నియోజక వర్గంలోని 77 సచివాలయాలకు గాను ఈ వంద రోజుల్లో 42 సచివాలయాల పరిధిలోని 9,500 కుటుంబాలను స్వయంగా కలి సినట్లు తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌ ఆశీస్సులతో, ప్రజల ఆ దరణతో హ్యాట్రిక్‌ విజయం సాధించి తిరువూరు నియోజకవర్గాన్ని వందల కోట్ల రూపాయలతో మరింతగా అభి వద్ధి చేస్తానని హామీయిచ్చారు. అనంతరం 10, 11 వార్డుల్లో విస్తతంగా గడప గడపకు కార్యమాన్ని అట్టహాసం గా నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎఎంసి చైర్మన్‌ శీలం నాగనర్సిరెడ్డి, మాజీ ఛైర్మన్‌ మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, జెడ్పిటిసి లు యరమల రామచంద్రారెడ్డి, భీమిరె డ్డి లోకేశ్వరరెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొ రేషన్‌ డైరెక్టర్‌ కాలసాని విజయలక్ష్మి, నగర పంచాయతీ ఛైర్పర్సన్‌ గత్తం కస్తూరి భాయి, వైస్‌ ఛైర్పర్సన్లు వెలు గోటి విజయలక్ష్మి పాల్గొన్నారు