ప్రజలకు కరపత్రం ఇస్తున్న ఎమ్మెల్యే ధనలక్ష్మి
ప్రజాశక్తి - రంపచోడవరం
అర్హత కలిగిన వారందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి అన్నారు. మండలం ముసురుమిల్లి సచివాలయం పరిధిలోని చిన్న భారంగి, బోర్నగూడెం, ఇర్లపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో గురువారం ఆమె గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న కాలంలో పథకాలన్నీ మరింత పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పిటిసి, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాల్గొన్నారు.










