Dec 08,2022 22:47

ప్రజాశక్తి - జీలుగుమిల్లి
              అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని దర్భగూడెం పంచాయతీలోని మారుమూల ఏజెన్సీ గ్రామాలైన మడకవారిగూడెం, కొత్త చీమలవారిగూడెం, రమణక్కపేటలో గురువారం నిర్వహించిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో లేదో అని అడిగి తెలుసుకున్నారు. మూడేళ్లుగా ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక్క వైసిపికె సాధ్యమైందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు లోటు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కొర్శ పోసమ్మ, జెడ్‌పిటిసి మల్లం వసంతరావు, వైస్‌ ఎంపిపి సోమగాని శ్రీనివాసరావు, సర్పంచి సున్నం ఉషారాణి, కుంజా పార్వతి, సొసైటీ అధ్యక్షులు కొల్లూరి రాంబాబు, బి.శ్రీనివాస్‌రెడ్డి, ఘంటసాల గాంధీ, ఎంపిటిసి సభ్యులు సున్నం సురేష్‌, రాముడు, రాఘవ రెడ్డి, ఎంపిడిఒ మంగతాయారు, డిటి సందీప్‌, ఎఇ ప్రసాద్‌, రాంపండు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.