ప్రజాశక్తి-రాజవొమ్మంగి
అర్హులైన లబ్ధిదారులందరికీ కులమతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి అన్నారు. శనివారం మండలంలోని కిండ్ర పంచాయితీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంపీపీ గోము వెంకటలక్ష్మి ఆధ్వర్యాన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటా పర్యటించి లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నది ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిడిపికి అడ్రస్ కూడా ఉండదన్నారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన వైసిపి నేత కనిగిరి వీరబాబుకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన రూ.3 లక్షల చెక్కును ఎమ్మెల్యే ధనలక్ష్మి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఒడుగుల జ్యోతి, సొసైటీ అధ్యక్షులు సింగిరెడ్డి రామకృష్ణ, సర్పంచులు డి నాగు, చంద్రుడు, బి సత్యనారాయణ, ఎంపీటీసీ దుర్గా, వ్యవసాయ కమిటీ చైర్మన్ బి.వెంకటరమణ, వైసిపి నాయకులు డి వెంకటేశ్వరరాజు, ఎన్ కుశరాజు, సిహెచ్ ప్రసాద్, కె దుర్గాప్రసాద్, ఎ.సత్యనారాయణ, కె రాంబాబు తదితరులు పాల్గొన్నారు.










