Oct 31,2022 23:37

సమస్యలు తెలుసుకుంటున్న కెకె.రాజు

ప్రజాశక్తి- సీతమ్మధార :అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడమే వైసిపి ప్రభుత్వ లక్ష్యమని వైసిపి ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అన్నారు 26వ వార్డు లలితనగర్‌లో గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొని, సమస్యలేమైనా ఉంటే తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, పోతు సత్యనారాయణ బోడ్డేటి కిరణ్‌కుమార్‌, 14వ వార్డు కార్పొరేటర్‌ అనిల్‌ కుమార్‌రాజు పాల్గొన్నారు
సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌
సీతమ్మధార: ఉత్తర నియోజకవర్గం పరిధిలోని ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించే లక్ష్యంతో వైసిపి కార్యాలయంలో సమన్వయకర్త , నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కెకె.రాజు గ్రీవెన్స్‌ నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోనిపలువురు నేరుగా వచ్చి కెకె.రాజుకు సమస్యలను విన్నవించి, వినతిపత్రాలను అందజేయగా, వాటిలో పలు సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరిస్తానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌, ఫ్లోర్‌లీడర్‌ బాణాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు కె.అనిల్‌ కుమార్‌ రాజు, ఆళ్ల లీలావతిశ్రీనివాస్‌, పి.ఉషశ్రీ పాల్గొన్నారు.