ప్రజాశక్తి -కంచరపాలెం : ప్రజాసమస్యల పరిష్కారం, చివరి లబ్ధిదారుని వరకు అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టడమే గడపగడపకు మన ప్రభుత్వం లక్ష్యమని ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు అన్నారు. శనివారం 53వ వార్డు మురళీనగర్-6 సచివాలయం మర్రిపాలెం, జాకీర్ హుస్సేన్ నగర్, ప్రిన్స్ అపార్ట్మెంట్ ప్రాంతాల్లో వార్డు కార్పొరేటర్ బర్కత్ ఆలీతో కలిసి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించడంతోపాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు నూకరాజు, 53వ వార్డు నాయకులు సదరం జ్ఞానేశ్, రామలక్ష్మీ, హనుమంతు, షేక్ బాబ్జి, వలీ, పాత్రో, బాబా, జోత్స్న సూర్య, చిన్నా, భాస్కర్, జయలక్ష్మీ, గోవింద్, సంపత్, శ్రీను, సీనియర్ నాయకులు చిరంజీవి, హరిపట్నాయక్, అచ్చుతరావు, సునీల్, క్రిష్ణ, రమేష్ పాల్గొన్నారు.










