Jul 27,2022 22:39

సమస్యలను అడుగుతున్న ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

ప్రజాశక్తి- సీతమ్మధార : అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారని ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె.రాజు అన్నారు బుధవారం 26వార్డు లలితానగర్‌ సచివాలయం, ఎన్జీవోస్‌ కాలనీ ప్రాంతాల్లో మాజీ కార్పొరేటర్‌ పోతు సత్యనారాయణతో గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీసారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కె.అనిల్‌ కుమార్‌రాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్‌రాజు, మాజీ కార్పొరేటర్లు జివి రమణి, బులుసు జగదీశ్‌, వార్డు అధ్యక్షులు పైడి రమణ, డైరెక్టర్లు రాయుడు శ్రీను, వాసు, 26వార్డు నాయకులు బొడ్డెటి కిరణ్‌ కుమార్‌, పాండవ శ్రీను, గండ్రేటి రవి, నేపాల్‌ శ్రీను పాల్గొన్నారు.
విరాట్‌నగర్‌లో గడపగడపకూ...
వేపగుంట :
93వ వార్డు పరిధి విరాట్‌నగర్‌లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీసి, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు హారతులిచ్చి, ఎమ్మెల్యేను స్వాగతించారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ పాదయాత్రలోనూ, ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ సిఎం జగన్‌ అమలు చేశారని, పంచగ్రామాల భూసమస్య కూడా త్వరలోనే పరిష్కారమౌతుందన్నారు. కార్యక్రమంలో వైసిపి నేతలు రాజు, కాంతమ్మ, సత్తిబాబు పాల్గొన్నారు.
గోపాలపట్నం : 92వ వార్డు వెంకటాపురంలో, వైసిపి పశ్చిమ సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్‌, జివిఎంసి కోఆప్షన్‌ సభ్యుడు బెహరా భాస్కరరావు ఆధ్వర్యంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా, లేదా ఆరా తీశారు.అర్హులైన వారికి సంక్షేమలబ్ధి చేకూరుస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ ఎంఎం.నాయుడు, వైసిపి నేతలు గొర్లే అప్పలస్వామినాయుడు గునిశెట్టి శ్రీనివాసరావు, గేదెలు మురళీకృష్ణ, బలిజ అప్పలనాయుడు, గొంతున నాగరాజు పాల్గొన్నారు