
ప్రజాశక్తి - లింగసముద్రం :అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన కొనసాగిందని మండల పరిషత్ అధ్యక్షులు పెన్నా కృష్ణయ్య అన్నారు.గురువారం మండల కేంద్రమైన లింగసముద్రంలోని సచివాలయం-1లో ఆంద్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను సంక్షేమ పథకాలను అందించిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు.గతంలో ఎవ్వరే చేయని విధంగా పరిపాలన సాగించి ప్రజల మనన్నలు పొందిన జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉందని జడ్‌పిటిసి సభ్యులు డాక్టర్ చెన్ను నళినిపద్మ అన్నారు.వైసిపి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమి చేశారనేది ప్రజలకు వివరించాలన్నారు.సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజల ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారో ఇంటింటికి తిరిగి అడిగి తెలుకోవాలని చెప్పారు.అనంతరం పంచాయితీలోని ఎస్‌టి కాలనీలో ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ పిచ్చపాటి తిరుపతిరెడ్డి,జెసిఎస్ కన్వీనర్ వరికూటి క్రిష్ణారెడ్డి,సూపరిండెంట్ కట్టా శ్రీనివాసులు,సర్పంచ్ రాఘవులు,ఎఎంసి వైస్ చైర్మన్ మేకనబోయిన శ్రీనివాసులు,కోఆప్షన్ సభ్యులు షేక్ షషి,సర్పంచ్‌లు దామా సీతారామాయ్య,డబ్బుగొట్టు మల్లిఖార్జున,వైసిపి నాయకులు వంకాయపాటి వెంకటేశ్వర్లు, మల్లెబోయిన వెంకటేశ్వర్లు,వెన్నపూస కొండారెడ్డి,ఉండేలా ఆదినారాయణరెడ్డి,ఈఓపిఆర్‌డి కెవి. సుబ్బారావు,పంచాయితీ కార్యదర్శులు మాధవరావు,నవీన్ ఉన్నారు.