Nov 07,2023 21:39

గ్రామస్తులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కళావతి

ప్రజాశక్తి - భామిని : ఎన్నికలు వరకే రాజకీయమని, ఎన్నికల అనంతరం రాజకీయాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి అర్హత ప్రామాణికంగా సంక్షేమ ఫలాలు అందించిన ప్రభుత్వం వైసిపి అని, ఈ అంశం లబ్ధిదారులు మరిచిపోరాదని స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి తెలిపారు. భామిని సచివాలయం పరిధిలో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటింటి వెళ్లి ఈ ప్రభుత్వం హయాంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, సకాలంలో రేషన్‌, పెన్షన్‌ అందుతుందా అనే అంశాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దదిమిలికి చెందిన సిద్దేశ్వర శ్రీశైలంకు సిఎం సహాయ నిధి నుండి మంజూరైన లక్ష రూపాయల చెక్కును ఆయన భార్య జ్యోతికి అందజేశారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ తోట సింహాచలం, వైస్‌ ఎంపిపి బోనగడ్డి ధర్మారావు, ఆదివాసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిడ్డిక తేజేశ్వరరావు, జెసిఎస్‌ కో ఆర్డినేటర్‌ కొత్తకోట చంద్రశేఖర్‌, మండల వైసిపి నాయకులు రొక్కం రమేష్‌, బొమ్మాళి సంజీవరావు, పోతల మజ్జి, పోతల హరికృష్ణ, మామిడి కృష్ణ, పోతల చంద్రభూషణ, బొమ్మాలి బాలకృష్ణ, గేదెల మోహన్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.