ప్రజాశక్తి - వెంకటాచలం : అర్హులందరికీ సంక్షేమ పథకాల అందించడమే లక్ష్యంగా సిఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం మండలంలోని గురువారం చవటపాలెం గొలగమూడి గ్రామ సచివాలయం వద్ద జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొని సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి రాబోయే 2 నెలల్లో సర్వేపల్లి నియోజక వర్గంలో భూముల సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు పొదలకూరు మండలం ఆర్.వై.పాలెం, కనుపర్తి, మనుబోలు మండలం వీరంపల్లి, వెంకటాచలం మండలం చవటపాలెం, గొలగమూడి గ్రామ సచివాలయాల్లో జగనన్న సురక్ష శిబిరాలను మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. తొలుత స్వాతంత్య్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని, ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. లబ్ధిదారులకు వివిధ రకాల సర్టిఫికెట్లను అందజేశారు. డి ఎల్ డి ఓ వసుమతి, ఎంపీడీవోలు నగేష్ కుమారి, వెంకటేశ్వర్లు, తాసిల్దార్లు వీర వసంత కుమార్, శివ కష్ణయ్య, సుధీర్, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మండల వెంకట శేషయ్య మండల కన్వీనర్ కొనదన మోహన్ నాయుడు పాల్గొన్నారు.










