Jun 18,2023 01:09
మాట్లాడుతున్న ఎంపిపి చింతల శ్రీకృష్ణయ్య

ప్రజాశక్తి-నగరం: మండలంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మండల అధ్యక్షులు చింతల శ్రీకృష్ణయ్య అన్నారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సచివాలయ సిబ్బందికి ఆయన దిశా నిర్దేశం చేశారు. మండల పరిధిలో అర్హత ఉన్న ఏ ఒక్కరికి కూడా జగనన్న సంక్షేమ ఫలాలు అందలేదని ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు రాకూడదని వారికి తెలిపారు. క్యాస్ట్‌, ఇన్‌ కమ్‌, డెత్‌, బర్త్‌, మ్యారేజ్‌, ఫ్యామిలీ, కౌలు రైతు కార్డు, ఆధార్‌కు ఫోన్‌ నంబర్‌ లింక్‌ వంటి 9రకాల సర్టిఫికెట్స్‌ను వెంటనే అందించేందుకు ఈ జగనన్న సురక్ష ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి అర్హులను గుర్తించి అందవలసిన పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ అధికారి చక్రపాణి ప్రసాద్‌, తహసీల్దార్‌ ఎం శ్రీనివాసరావు, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.