ప్రజాశక్తి -కరప
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం పథకాలు అందిస్తూ సంక్షేమ పాలన అందిస్తున్నామని ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు అన్నారు. కరప గ్రామంలో మంగళవారం సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమల తీరుని వివరించారు . ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నారని అన్నారు, వైసిపి నాయకులు గోన శ్రీను తన సొంత ఖర్చులతో కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులకు పంచాయతీ కార్యదర్శులకు సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు, అధికారులు, కార్యకర్తలు, వాలంటీర్లు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, అనధికారులకు తన స్వగృహం వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి యాళ్ళ సుబ్బారావు, ఎంపిపి పింకే శ్రీ లక్ష్మీ సత్తిబాబు, వైస్ ఎంపిపి పాట్నీడి భీమేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు, గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి లోహిదాస్, ఎంపీడీవో కర్రే స్వప్న, తహశీల్దార్ పొన్నమండ శ్రీనివాసరావు, ఎలక్ట్రికల్ ఎఇ సాన ఈశ్వర్ ప్రసాద్, ఎపి నెడ్కాప్ డైరెక్టర్ సాదే విజయలక్ష్మి రాఘవ, గోన శ్రీను, ముద్రగడ్డ వీరబాబు, మేడిశెట్టి రామ్ బుజ్జి, సవిలె రాజేష్, మారెళ్ళ వెంకట రమణ, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు పథకాలు వివరిస్తున్న ఎంఎల్‌ఎ కన్నబాబు










