May 04,2023 23:46

గడపగడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న కెకె.రాజు తదితరులు

ప్రజాశక్తి- కంచరపాలెం : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు తెలిపారు. జివిఎంసి 49వ వార్డు పరిధి బర్మా క్యాంప్‌ కాలనీ, పిఆర్‌.గార్డెన్‌, మాణిక్యాంబ కాలనీ, చాకలిగెడ్డ ప్రాంతాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ అల్లు శంకరరావుతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజల సమస్యలనడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కెకె.రాజు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు, చివరి లబ్ధిదారుని వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలనే ఉద్దేశంతో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ.రవికుమార్‌, రాయుడు శ్రీను, నూకరాజు, ఢిల్లీరావు, రాము, సరస్వతమ్మ, పావని, రాంబాబు, ఏసు, ఆచారి, మున్నా, సుబ్బలక్ష్మి, మస్తాన్‌, దేవుడు, హైమ, షేక్‌ బాబ్జి, కె.చిన్న, వసంతల అప్పారావు, సబ్బవరపు శీను, గురువోజీ, కరి రామారెడ్డి, జక్కంపూడి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.