ప్రజాశక్తి-కొయ్యూరు
వైసిపి ప్రభుత్వ హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. మండలంలోని కొండగోకరి గ్రామ సచివాలయం పరిధిలో కొత్తపాడి, పాతపాడి, కొత్తరత్నంపేట, పాతరత్నంపేట గ్రామాలలో సోమవారం ఆమె గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గడపకూ తిరుగుతూ ఈ మూడేళ్లన్నరేళ్ల కాలంలో ప్రభుత్వం అందించి సంక్షేమ పథకాల గురించి వివరించారు. మొత్తంగా 265 గడపలను భాగ్యలక్ష్మి సందర్శించారు. సమస్యలను తెలుసుకుంటూ... అవ్వతాతలతో మాట్లాడుతూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్ బాబు, జెడ్పిటిసి వారా నూకరాజు, వైస్ ఎంపీపీలు అప్పన్న వెంకటరమణ, అంబటి నూకాలమ్మ, కొండగోకరి సర్పంచ్ రేగటి ముసలి నాయుడు, ఇతర గ్రామాల సర్పంచ్‌లు పాటి నూకరత్నం, జంప రాజకుమారి, రావుల వెంకటలక్ష్మి, పొట్టిక శ్రీను, సుర్ల చంద్రరావు, ఎంపిటిసిలు సద్దాం మల్లేశ్వరి, బడిజన అప్పారావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గాడి నాగమణి, ఏఎంసీ చైర్మన్ జైతి రాజులమ్మ, వైసిపి నాయకులు జల్లి బాబులు, గాడి సత్యనారాయణ, సడ్డా సావిత్రి, కాళ్ళ వనం బాబు, బండి సుధాకర్, దోని బాబ్జి, గాడి అచ్చిబాబు, కసరాజు రవి, ఎంపీడీవో, ఎమ్మార్వో, ఎంఈవో పాల్గొన్నారు.










