బిసి సొసైటీ ఇడి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం కృష్ణాజిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం కార్య నిర్వాహక సంచాలకులు ఏ. శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్ధిక సంస్థ మేనేజింగ్ డైరెక్టరు ఆదేసాను సారం గురువారం శ్రీనివాసరావు మచిలీపట్నం నగరంలోని వివిధ డివిజన్ లలో ప్రభుత్వ పథకాల మంజూరుకు దరఖాస్తు చేసుకున్న వారి వారి వివరాలను స్వయంగా పరిశీలించి లబ్దిదారుల పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ జగనన్న చేదోడు పథకము కింద షాపులున్న టైలర్స్, రజకులు, నాయీబ్రహ్మణులు రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించిందని కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్దిదారుడుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతోనే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరపాలని, సంబంధిత వాలంటీర్స్, వెల్ఫేర్ సెక్రటరీలకు పలు సూచనలు చేశామన్నారు.










