ప్రజాశక్తి-యంత్రాంగం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. శుక్రవారం జిల్లాలోని పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. తుని కొత్త సూరవరంలో మంత్రి దాడిశెట్టి రాజా జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడడంతో యనమల రామకష్ణుడు ఓట్ల కోసం మోకాళ్ళ మీద నడుస్తూ ఓట్లు అడుగుతున్నారని, తన కుమార్తె దివ్యని ఎలాగైనా గెలిపించాలని అష్ట కష్టాలు పడుతున్నారని అన్నారు. ప్రజలు యనమల కుటుంబాన్ని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. గ్రామంలో రూ.43 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్టు తెలిపారు. అనంతరం అర్హులైన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి సోడిసెట్టి సత్య నాగేశ్వరరావు, పోతల రమణ, పోతల లక్ష్మణ్, సక్కుల నాగేంద్ర నెహ్రూ, కసనం దొరబాబు, గారా శ్రీను, నట్ట చక్రరావు, కీర్తి రాఘవ, వంగలపూడి అప్పారావు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఉద్యమంగా నిర్వహిస్తోందని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి అన్నారు. జి.మేడపాడులో ఎంపిడిఒ శ్రీలలిత అధ్యక్షతన, సామర్లకోట బ్రౌన్‌పేట సచివాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ జె.రామారావు అధ్యక్షతన జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు, వైసిపి పంచాయితీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు మోరంపూడి రంగ, సర్పంచ్ పటాని దేవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మోరంపూడి రమేష్, వార్డు సభ్యులు, ఎంపిటీసీ సభ్యులు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఊబా జాన్ మోజెస్, కౌన్సిలర్‌లు పిట్టా సత్యనారాయణ, నాయకులు ఇరుసుమళ్ళ సాయి, వారా సుధాకర్, వలంటీర్లు పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్ రాజపూడి సచివాలయం 2 వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎంఎల్‌ఎ జ్యోతుల చంటి బాబు మాట్లాడారు. ఎంపిడిఒ వసంత్ కుమార్, సర్పంచ్ బూసాల విష్ణుమూర్తి, ఎంపిపి అత్తులూరి నాగబాబు, ఎంపిటిసి నంగన నాని, దేవర రాజు పాల్గొన్నారు. తాళ్లరేవు నీలపల్లి పంచాయతీలో సర్పంచ్ చిట్టూరి నాగమణి అధ్యక్షతన జరిగిన సభలో ఎంపిపి రాయుడు సునీత ప్రత్యేకాధికారి లక్ష్మీనరసయ్య మాట్లాడారు. సభలో 1100 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపిడిఒ ఎం.అనుపమ తెలిపారు. నీలపల్లిలో డ్రైనేజీలు నిర్మించాలని, తాగునీరు పూర్తిస్థాయిలో అందించాలని ప్రజలు అధికారులు దష్టికి తీసుకువచ్చారు. మేజర్ సమస్యలను ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎంపిపి ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టూరి కలికి మూర్తి, రెడ్డి సతీష్, రేవు మల్లీశ్వరి, మోకా మధు, ఎంపిటిసి దంగేటి సూరిబాబు, సచివాలయాల మండల కన్వీనర్ దున్న శ్రీకాంత్, రాయుడు గంగాధర్, కట్టా దుర్గారావు, గునిపే విష్ణు, కొండ, కార్యదర్శి వరలక్ష్మి పాల్గొన్నారు.










