Sep 18,2023 00:19

ప్రజాశక్తి - భట్టిప్రోలు
అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పదకాలు అందజేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు అన్నారు. పట్టణంలో ఆదివారం గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. సిఎం వైఎస్‌ జగన్‌కే సంక్షేమ పాలన సాధ్యమని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా సిఎం జగన్‌ ప్రజల మన్ననలు పొందుతున్నట్లు చెప్పారు. అర్హత ఉండి పథకాలు అందని వారు వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకొని పొందవచ్చునని సూచించారు. అద్దేపల్లి దళితవాడలో బడుగు గోపి అనే టిడిపి కార్యకర్త వైసీపీ కార్యక్రమాలు నచ్చటంతో మంత్రి సమక్షంలో వైసిపిలో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ రవికిరణ్మయి, ఎంపీపీ డివి లలిత కుమారి, జడ్పిటిసి ఉదయభాస్కరి, నాయకులు వేల్పూరి బాలసుబ్రమణ్యం (చిన్నారి), వేల్పూరి  నాగేశ్వరరావు, సూర్య పల్లి, పిఎసిఎస్ చైర్పర్సన్ గోవర్ధనగిరి శేషాచల శ్రీనివాసరావు, నాయకులు మల్లేశ్వరరావు, బాలాజీ, ఎల్లమంద, కుందేటి రమేష్, కౌతరపు శ్రీనివాసరావు, రెహమాన్ ఉన్నారు.