Nov 18,2023 19:43

మాట్లాడుతున్న ఎంపిడిఒ దశరథ రామయ్య

ప్రజాశక్తి - నందవరం
అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందాలని, ప్రతి అధికారీ కలిసికట్టుగా పని చేయాలని ఎంపిడిఒ దశరథ రామయ్య తెలిపారు. శనివారం ఎంపిడిఒ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. కమ్యూనిటీ సోక్‌ ఫిట్స్‌, ఆడుదాం ఆంధ్ర, కుల గణన సర్వే, బాల్య వివాహాల నివారణ, పంచాయతీ అభివృద్ధి, జగనన్న విద్యా దీవెన, పింఛన్లపై సమీక్ష నిర్వహించారు. ప్రతి అధికారీ ఒకరికొకరు సహాయం, సమన్వయం చేసుకుంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని తెలిపారు.