Jul 14,2023 23:31

ప్రజాశక్తి- యంత్రాంగం అర్హత ఉండి పథకాలను లబ్ధిదారులను గుర్తించి పథకాలు అందజేయడమే జగనన్న సురక్ష యొక్క ముఖ్య ఉద్దేశమని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. శుక్రవారం పలుచోట్ల లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందించారు. రౌతులపూడి ములగపూడిలో ఎంపిడిఒ గోవిందు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎంఎల్‌ఎ పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్‌ పాల్గొని మాట్లాడారు. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ జి.రమణమ్మ, కో ఆప్షన్‌ సభ్యులు సత్యనారాయణ, అంకంరెడ్డి సతీష్‌ కుమార్‌ పాల్గొన్నారు. గండేపల్లి ఎన్‌టి.రాజాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో జెడ్‌పిటిసి పరిమి వెంకటలక్ష్మి మంగతాయారు బాబు మాట్లాడారు. తహశీల్దారు కెవివి.సత్యనారాయణ, సర్పంచ్‌ బిక్కిన దేవిదుర్గ, ఉప సర్పంచ్‌ పరిమి రాజు, పాలచర్ల సత్యనారాయణ, గోపాలపురం సర్పంచ్‌ పార్థసారథి, ఎంపిడిఒ బిఎస్‌కె.రామన్‌, పంచాయతీ కార్యదర్శి తరంగణి పాల్గొన్నారు. పెదపూడి ఎంపిడిఒ పి.విజయభాస్కర్‌, తహశీల్దారు టి.సుభాష్‌ పెదపూడి సచివాలయం-2లో నిర్వహించిన గ్రామ సభలో 795 ధ్రువపత్రాలను అందించారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ విప్‌ సమ్మంగి దుర్గాప్రసాద్‌, పప్పు సింహాచలం, మార్ని వెంకట్రావు, ఇఒపిఆర్‌డి మన్యం శ్రీనివాస్‌ చౌదరి, తిప్పాన వెంకటరమణ, వ్యవసాయశాఖాధికారి టివిఆర్‌.మణిదీష్‌, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. తాళ్లరేవు సచివాలయం-1లో సర్పంచ్‌ రెడ్డి అరుణ సుహాసిని దేవి అధ్యక్షతన జరిగిన సభలో తహశీల్దారు పోతురాజు, ఇఒపిఆర్‌డి మల్లాడి భైరవమూర్తి, ఎంపిపి రాయుడు సునీత, జెడ్‌పిటిసి దొమ్మేటి సామ్యూల్‌, ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడుపూడి శివన్నారాయణ, రాయుడు గంగాధర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, ఆకుల వెంకన్న, చిట్టూరి చలపతి, నందికోళ్ల శ్రీమన్నారాయణ, పి.బైరవమూర్తి , బొంతు మోహన్‌, రామకృష్ణ, పిల్లి పరదేశ్వరరావు పాల్గొన్నారు. పెద్దాపురం పట్టణ పరిధిలో 12, 13 వార్డుల సచివాలయాల్లో లబ్ధిదారులకు 11 రకాల పత్రాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జె.సురేంద్ర, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డు తులసి మంగతాయారు, వైస్‌ చైర్మన్‌ నెక్కంటి సాయి ప్రసాద్‌, కనకాల మహాలక్ష్మి, మున్సిపల్‌ కౌన్సిలర్లు కొట్టు పవన్‌ కుమార్‌, త్సలికి సత్య భాస్కరరావు, మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు వాసంశెట్టి గంగ, వైసిపి నాయకులు గుర్రాల యాకోబు, చింతా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్‌ 7వ సచివాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ జాస్తి రామారావు అధ్యక్షతన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గంగిరెడ్డి అరుణ కష్ణమూర్తి, ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు పాల్గొన్నారు. చంద్రంపాలెంలో ఎంపిడిఒ డి శ్రీలలిత అధ్యక్షతన చైర్‌పర్సన్‌ గంగిరెడ్డి అరుణ, వైస్‌ ఛైర్మన్‌ ఊబా జాన్‌ మోజెస్‌, ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు, ఎంపిడిఒ డి.శ్రీలలిత, తహశీల్దారు ఎస్‌.లకీëనరసకుమారి, పట్టణ జెసిఎస్‌ కన్వీనర్‌ ఇరుసుమల్ల సాయి, నేతల హరిబాబు, వారా పాప, వారా సుధాకర్‌, రెడ్నం దొరబాబు, చిట్టిమాని శ్రీను, నేతల శ్రీను, రొట్టె అబ్బులు పాల్గొన్నారు.