ప్రజాశక్తి-చోడవరం
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. చోడవరం సచివాలయం-3 పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం ఆయన నిర్వహించారు. ప్రభుత్వం నుండి లబ్ధిదారులు పొందిన సహాయాన్ని ఆయన స్థానిక మహిళలకు వివరించారు. ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి వెంటనే మంజూరు చేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. అర్హత ఉండి పింఛన్లు రాలేదని కొంతమంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అర్హులైన వారందరికీ పింఛన్ల కోసం అప్లోడ్ చేయాలని సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాడి కాసు, వైస్ ఎంపీపీ బైన ఈశ్వరి కుమారి, తహశీల్దారు తిరుమల బాబు, పంచాయతీరాజ్ డిఇ ప్రసాద్, వైసిపి నాయకులు బి సూర్యనారాయణ, తినబోయిన అప్పారావు యాదవ్, దేవరాపల్లి సత్య, గుమ్మడి శ్రీను, సేనాపతి శ్రీనివాసరావు, ఓరుగంటి నెహ్రూ, పుల్లేటి వెంకటేష్, సేనాపతి సత్యారావు, నాయకులు పాల్గొన్నారు.










