'గడప గడపకూ'లో ఎమ్మెల్యే కోన రఘుపతి
ప్రజాశక్తి-బాపట్ల రూరల్: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం 122వ రోజు ఆదివారం బాపట్ల మండలం నరసాయపాలెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించి ముందుకు వెళుతుందన్నారు. అనంతరం గ్రామ సచివాలయం సిబ్బందితో ప్రతి గడపకూ వెళ్లి ఈ 3 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హైమావతి, సుదర్శన్ బాబు, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ ఆయా శాఖల అధికారులు, సిబ్బంది నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.










