ప్రజాశక్తి- పద్మనాభం : ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎం.శ్రీనివాసరావు గురువారం అధికారులను ఆదేశించారు. పద్మనాభం పంచాయతీలో రెండవ రోజు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి సమస్యలడిగి తెలుసుకున్నారు. నిరుపేద అయిన తమకు ఇంటి పట్టా ఇవ్వలేదని కాల పద్మ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చింది. ఆయన స్పందించి వెంటనే అధికారులతో మాట్లాడారు. 90 రోజుల్లో పట్టాలివ్వాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. పార్టీలకతీతంగా పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు, పింఛన్లు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చారు. వాటిని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కె.రాంబాబు, జడ్‌పిటిసి శంకర్ గిరిబాబు, వైసిపి మండల అధ్యక్షులు కోరాడ లక్ష్మణ, నాయకులు కాదుబాబు ఈశ్వరరావు, బంగారు అప్పడు, పద్దు తదితరులు పాల్గొన్నారు.
వేపగుంట : బిసి.కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే ఆదీప్‌రాజు ఇంటింటికీ వెళ్లి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు ఎమ్మెల్యేకు హారతులు పట్టారు. ఎమ్మెల్యే అదీప్‌రాజు మాట్లాడుతూ, 1వ తేదీకి పింఛన్లను ఇంటికే చేరవేస్తున్న ఘటన జగన్మోహన్‌రెడ్డిదేనన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మురళి, రాంబాబు, సత్తిబాబు, సచివాలయ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.










