Jul 26,2022 23:38

వేములవలసలో ముత్తంశెట్టికి సమస్యలను విన్నవిస్తున్న గ్రామస్తులు

ప్రజాశక్తి- యంత్రాంగం
ఆనందపురం :
అర్హత గల ప్రతి ఒక్కరికీ వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందని భీమిలి ఎమ్మెల్యే, వైసిపి జిల్లా అధ్యక్షులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని వేములవలస గ్రామంలో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందాయా? లేవా అని అడిగి తెలుసుకున్నారు. స్థానికులు చెప్పిన పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వేములవలస జగనన్న ఇండ్ల స్థలాలు పంపిణీ జరగలేదని, ఆనందపురంలో ఫుట్‌పాత్‌పై వ్యాపారం చెసుకునే వారు రైతు బజార్‌లో అమ్ముకునేలా ఏర్పాటుచేయాలని, ఆనందపురం బ్రిడ్జి కూడలిలో ట్రాఫిక్‌ సిగల్‌ ఏర్పాటు, కాలువలను మరమ్మతులు చేపట్టాలని, స్థానికంగా రైతు బజార్‌ ఏర్పాటు చేయాలని, ఆర్‌టిసి కాంప్లెక్స్‌ ఏర్పాటు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి కోరాడ వెంకటరావు, మండల వైసిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మజ్జి వెంకటరావు, వైస్‌ ఎంపిపిలు పాండ్రంకి శ్రీను, బొట్ట ధనలక్ష్మి రామకృష్ణ, ఎంపిడిఒ లవ రాజు, తహశీల్దార్‌ ఎల్‌.రామారావు, స్థానిక ఎంపీటీసీ కోరాడ సూర్యకుమారిరాంబాబు, నాయకులు కాకర్లపూడి నరసింహ రాజు, బోని అప్పలనాయుడు, కాకర వెంకటరమణ, చందక అప్పలస్వామి, రౌతు శ్రీను ఇతర నాయకులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-సీతమ్మధార : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధి 26వ వార్డు లలితానగర్‌, అక్కయ్యపాలెం, ఎన్‌జిజిఒఎస్‌ కాలనీ ప్రాంతాల్లో నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు, 26వ వార్డు వైసిపి నాయకులు పోతు సత్యనారాయణ, బొడ్డేటి కిరణ్‌కుమార్‌ కలిసి పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కెకె రాజు మాట్లాడుతూ, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల శ్రీనివాస్‌, బులుసు జగదీష్‌, కెపి రత్నాకర్‌, రాయుడు శ్రీనివాసరావు, పాండవ శ్రీను, సునీల్‌, శ్యామల, అమ్మాజీ, శేషు, నవాబ్‌, ఉప్పాడ రాము, తదితరులు పాల్గొన్నారు.