ప్రజాశక్తి-చోడవరం
అర్హులైన వారికి ఇళ్లు, పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాలను అందించేందుకు వైసిపి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అన్నారు. శనివారం చోడవరం పంచాయతీలో సచివాలయం-5 పరిధిలో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏడవాక సత్యారావు, ఎంపీపీ గాడి కాసు, ఎంపీడీవో ఎస్‌డి శ్యామ సుందర్, పంచాయతీరాజ్ డిఇ జిఎస్ ప్రసాద్, వైస్ ఎంపీపీ పైన ఈశ్వరరావు కుమారి, స్థానిక సర్పంచ్ బండి నూకాలమ్మ శ్రీను, వైసిపి నాయకులు ఓరుగంటి నెహ్రూ, జ్యోతుల రమేష్, శివాలయం కమిటీ చైర్మన్ సత్యనారాయణ, వెంకటేష్, పందిరి శ్రీను, గుమ్మడి శ్రీను పాల్గొన్నారు.
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10వేలు ఆర్థిక సహాయం
అచ్యుతాపురం : మండలంలోని భోగాపురంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం ఎమ్మెల్యే కన్నబాబురాజు నిర్వహించారు. గ్రామంలోని తట్ట నూకరాజు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని తెలుసుకొని, ఆయన వద్దకు వెళ్లి పరామర్శించి రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు. తట్టవాని పాలెం, ఎరుకన్నపాలెం, జంగులూరు గ్రామాల్లోనూ ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు లాలం రాంబాబు, వైసిపి మండల శాఖ అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు, పార్టీ నాయకుడు కోన బుజ్జి, పి వాసు, లాలం పైడికొండ, ఎస్సై సన్యాసినాయుడు పాల్గొన్నారు.










