Sep 14,2023 20:53

ప్రజాశక్తి - ఉండి
అర్హులందరికీ పింఛన్లు అందజేస్తున్నామని డిసిసిబి ఛైౖర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు అన్నారు. గురువారం పెదపుల్లేరులో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పివిఎల్‌ నరసింహరాజు మాట్లాడారు. గతంలో కొత్త పింఛన్ల నమోదు కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తిరగాల్సి వచ్చేందని, జగన్మోహన్‌ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి పారదర్శకంగా పార్టీలకతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ వాలంటీర్ల ద్వారా పింఛన్లు నమోదు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా వైసిపి ఒంటరిగానే పోటీ చేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కరణం పార్వతి వెంకటేశ్వరరావు, ఎంపిటిసి రాయి రావులమ్మ, గ్రామ అధ్యక్షులు పప్పల రాంప్రసాద్‌, నాయకులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : నియోజకవర్గంలోని తాడేపల్లిగూడెం పట్టణం, రూరల్‌, పెంటపాడు మండలాల పరిధిలో కొత్తగా 1702 మందికి కొత్త పెన్షన్లు స్థానిక క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తాడేపల్లిగూడెం ఎంపిడిఒ విశ్వనాధ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అనపర్తి శామ్యూల్‌ కార్యక్రమం నిర్వాహకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ జగన్‌తోనే జనానికి మేలు జరుగుతోందన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో భాగంగా 1702 మంది అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు కొత్త పెన్షన్లు మంజూరయ్యాయన్నారు. ఇప్పటికే గూడెం నియోజకవర్గంలో 32,550 మందికి పెన్షన్లు ఇస్తున్నామని, వీటికి అదనంగా 1702 కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి ముత్యాల ఆంజనేయులు, మాజీ జెడ్‌పిటిసి ముప్పిడి సంపత్‌కుమార్‌, వన్‌ టౌన్‌ సచివాలయ కన్వీనర్‌ కోలుకులూరి ధర్మరాజు పాల్గొన్నారు.
పాలకొల్లు రూరల్‌ : లంకలకోడేరులో కొత్తగా మంజూరైన పింఛన్లను వైసిపి పాలకొల్లు ఇన్‌ఛార్జి గుడాల గోపి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చిట్టూరి కనకలక్ష్మి, సర్పంచి చొప్పల రజిని, ఉపసర్పంచి చంటి రాజు పాల్గొన్నారు.
పాలకొల్లు : వైసిపి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతిస్తోందని వైసిపి ఇన్‌ఛార్జి గుడాల గోపి చెప్పారు. పట్టణంలో 1, 2, 3, 7, 20, 21 వార్డుకు సంబంధించి నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ డిసిఎంఎస్‌ ఛైర్మన్‌ యడ్ల తాతాజీ, సీనియర్‌ నాయకులు గుణ్ణం నాగబాబు, పట్టణ అధ్యక్షులు చందక సత్తిబాబు పాల్గొన్నారు.
పాలకోడేరు : గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో పింఛను మంజూరు కావాలంటే ఎదురు చూడాల్సి వచ్చేదని, జగనన్న పాలనలో ప్రతి ఆరు నెలలకోసారి అర్హులకు పింఛన్లు మంజూరవుతున్నాయని మోగల్లు సోషల్‌ మీడియా గ్రామ సచివాలయాల ఇన్‌ఛార్జులు మద్దుల జగన్మోహన్‌ రావు (మౌళి) కోనాల ప్రకాష్‌ అన్నారు. మోగల్లులో గురువారం నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరలా జగనన్నను అంతా ముఖ్యమంత్రిగా చూడాలన్నారు. కార్యక్రమంలో సోషల్‌ మీడియా మండల ఇన్‌ఛార్జి, సర్పంచి మల్లిపూడి కృష్ణకుమారి, కాటూరి శాంతకుమారి, పెన్మత్స వెంకటలక్ష్మి, దొడ్డా విసు, బలే చిట్టిబాబు, బాలయ్య, చక్రధర్‌ రావు, పంచాయతీ కార్యదర్శి వెంకటరాజు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు వినోలా ప్రసన్న పాల్గొన్నారు. అలాగే శృంగవృక్షం గ్రామ సర్పంచి జంగం సూరిబాబు ఆధ్వర్యంలో కొత్తగా మంజూరైన 65 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసిపి నాయకుడు కలిదిండి కృష్ణంరాజు (బుజ్జి,) సర్పంచి జంగం సూరిబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు సొడదాసి నరేష్‌, పంచాయతీ ఉప సర్పంచి కలిదిండి ఆనందరాజు, వార్డు సభ్యులు సోము దుర్గాభవాని, వడ్డీ శేషు కుమార్‌, సొసైటీ అధ్యక్షుడు పాలా లక్ష్మణరావు, చెలంకూరు సత్యనారాయణ, చింతపల్లి ఆదిలక్ష్మి దండు పాల్గొన్నారు.
పోడూరు : అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేయడమే సిఎం జగన్‌ లక్ష్యమని వైసిపి పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపి అన్నారు. గురువారం రావిపాడు, వద్దిపర్రు, పెనుమదం గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులందరికీ కొత్తగా మంజూరైన పెన్షన్లను ఆయన అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి గుంటూరు పెద్దిరాజు, ఎంపిపి సబ్బితి సుమంగళిసాగర్‌, డిటిడిసి బాబు, సర్పంచి తానేటి బాబూరావు పాల్గొన్నారు.