
రామపురం : కులం, మతం, పార్టీ బేధం చూడకుండా అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఫించన్ అందిస్తున్న ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మాజీ ఎంపిపి, వైసిపి మండల కన్వీనర్ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన నూతన ఫించన్ల పంపిణీ కార్యక్రమం జరిగిం ది. ఈ కార్యక్ర మంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పాల్గొని కొత్తగా మంజూరైన లబ్ధి దారులకు ఫించన్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధా ప్యంలో ఆసరా కోసం ఎదురు చూసే అవ్వాతాతలకు వైసిపి ప్రభుత్వం అండగా నిలుస్తుం దన్నారు. వారికిచ్చే వద్ధాప్య పింఛన్ల మొత్తాన్ని ఇచ్చిన మాట ప్రకారం పెంచి వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే వచ్చి ఫించన్‌ను అందిస్తున్నారని చెప్పారు. ఏ ఒక్క పెన్షన్ తొలగించ కుండా కొత్త పెన్షన్లను మంజూరు చేసి సిఎం పేదల పక్షపాతి అని నిరూపించారన్నారు. వైఎస్‌ఆర్ సాచురేషన్ పద్ధతిలో అర్హులైన వారందరికీ పెన్షన్లను మంజూరు చేశారన్నారు. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సరానికి రూ.250 రూపాయలు పెంచుతూ పోతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయంలో రాష్ట్రంలో 40 లక్షల పెన్షన్లకు రూ.400 కోట్లు మాత్రమే అందించేవారని, సిఎం జగన్ ఇప్పుడు 68 లక్షల మందికి పెన్షన్లను ఇస్తున్నారని, నెలకు రూ.1900కోట్లు పెన్షన్లు రూపంలో అందిస్తున్నారని చెప్పారు. ఏడాదికి పెన్షన్ల రూపంలో రూ.24 వేల కోట్లను, నాలుగేళ్ళలో సుమారు లక్ష కోట్ల రూపాయలను పెన్షన్ల కోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఇదేనన్నారు. వచ్చేయేడాది జనవరికి రూ.3 వేలు పెన్షన్ అందివ్వడం జరుగు తోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్, ఉచితవిద్యుత్, 108, 104 పథకాలు ప్రవేశ పెట్టా రన్నారు.జగన్ పాలనలో సచి వాలయం, వాలంటరీ వ్యవస్థలు, అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ, చేయూత, రైతు భరోసా తదితర పథకాలును పెట్టి నేరుగా ప్రజల ఖాతాలలో జమ చేస్తు న్నారన్నారు. మండలంలో కొత్తగా మంజూరైన 321 మంది పెన్షన్ దారులకు వినాయక చవితి పండుగ సమయంలో నూతన పెన్షన్లు అందుతుండడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి మాసన వెంకటరమణ, మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథరెడ్డి, నల్లగుట్టపల్లి సర్పంచ్ అయోధ్యపురం నాగభూషణ్‌రెడ్డి, సర్పంచ్ వెంకటరెడ్డి .యువజన విభాగపు రాష్ట్ర కార్యదర్శి సూరం వెంకటసుబ్బారెడ్డి, ఎంపిడిఒ హైదర్‌వలీ, వైస్ ఎంపి పిలు రవిశం కర్ రెడ్డి, బాబు, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.