ప్రజాశక్తి - చీరాల
అర్హత కలిగిన లబ్ధిదారులు అందరికీ పింఛన్లను పంపిణీ చేస్తుందని 5వ వార్డు కౌన్సిలర్ సూరగాని లక్ష్మీ అన్నారు. పేరాల సచివాలయంలో నూతన పింఛన్లకు అర్హులైన గార్లపాటి సుబ్బులు, కొల్లిపర రామ మోహనరావు లబ్ధిదారులకు ఆమె పెన్షన్లను శుక్రవారం అందజేశారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో సిఎం జగన్మోహనరెడ్డి పరిపాలన చేస్తున్నారని అన్నారు. ఆ దిశగా వృద్ధులకు విడతల వారీగా రూ.3వేల వరకు పెన్షన్ పెంచి వృద్ధాప్యంలో బాసటగా నిలిచారని అన్నారు. అర్హులైన లబ్దిదారులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆమె వెంట మహిళా పోలీస్ కె అనిత, వాలంటీర్లు జి కేదర్నాథ్, ఏ కీర్తి, యు చిరంజీవి పాల్గొన్నారు.










