ప్రజాశక్తి - చింతలపూడి
అర్హులైన లబ్ధిదారులందరికీ ఫించను అందిస్తున్నామని చింతలపూడి గ్రంథాలయ ఛైర్మన్ మిర్యాల దిలిప్ తెలిపారు. చింతలపూడి పట్టణంలోని బోయగూడెం సచివాలయంలో నూతన ఫించనులను లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నిరంతరం కష్టపడుతున్నారని, పేదలకు సంక్షేమ పథకాలు అందించటమే వైసిపి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సెక్రటరి రాజా, వైసిపి నాయకులు గోపి, పలువురు నాయకులు పాల్గొన్నారు.










