Sep 17,2023 00:46

ప్రజాశక్తి - బాపట్ల రూరల్
అర్హులందరికీ నివేశన స్థలాలు ఇస్తామని ఎమ్మెల్యే కొన రఘుపతి అన్నారు. స్థానిక  తహసిల్దార్ కార్యాలయంలో శనివారం జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన 28మందికి కొత్తగా మంజూరైన ఇళ్ల స్థలాల పట్టాలని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని కొల్లా వెంకయ్య కాలనీలో 28మందికి పట్టాలు పంపిణి  చేశామన్నారు. వీరిలో ఎస్సీ5, బిసి 5, ఓసి 11, ఎస్టి 3, మైనార్టీ 4 ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డిఓ  జి రవీంద్ర, తహసిల్దార్ సిహెచ్ సుధారాణి, డీటీ కె శ్రీదేవి, మండల వైసిపి అధ్యక్షుడు  కోకి రాఘవరెడ్డి పాల్గొన్నారు.