ప్రజాశక్తి - వీరఘట్టం : అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమం పథకాలు అందిస్తుందని ఎమ్మెల్సీ పాలవలస విక్రంత్ అన్నారు. శుక్రవారం స్థానిక శ్రీ కోదండరామ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అర్జీదారులకు వివిధ రకాలైన ధ్రువ పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పి గౌరమ్మ, ఎంపిపి డి.వెంకటరమణనాయుడు, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ కర్రీ లీలాప్రసాదరావు, తహశీల్దార్ సిహెచ్ సత్యనారాయణ, ఎంపిడిఒ బిజె ప్రసాద్, ఇఒపిఆర్‌డి వి.రామచంద్రరావు, పిఎసిఎస్ డైరెక్టర్ భోగి మాణిక్య చంద్రశేఖర్, ఎఎంసి డైరెక్టర్ ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు డి.లలితకుమారి, నాయీ బ్రాహ్మణ డైరెక్టర్ బి.లక్ష్మీనారాయణ, ఎస్.రంజిత్‌కుమార్, సుహాస్‌కుమార్, కె.ప్రేమభూషణ రావు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : మండలంలోని మారుమూల ప్రాంతమైన మండ గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సర్పంచి హైమావతి ఆధ్వర్యాన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అనేది ఎంపిడిఒ సాల్మన్‌రాజు అడిగి తెలుసుకున్నారు. అర్హులకు ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ రాజేంద్ర, వైసిపి నాయకులు పత్తిక బిసు, తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురంటౌన్ : పట్టణంలోని కొత్తబెలగాంలో 8,9 వార్డు సచివాలయాల పరిధిలో 15, 16, 17, 18 వార్డులకు చెందిన ప్రజలకు మునిసిపల్ కమిషనర్ జె .రామ అప్పలనాయుడు ఆధ్వర్యంలో బంగారమ్మ కాలనీ ప్రాంతంలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు హాజరై సుమారుగా 600 మందికి ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బి.గౌరీశ్వరి, వైస్ చైర్మన్లు కొండపల్లి రుక్మిణి, యిండుపూరు గున్నేశ్వరరావు, పార్టీ ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, స్థానిక వార్డుల కౌన్సిలర్లు సంఘంరెడ్డి లక్ష్మీపార్వతి, చీకటి అనురాధ, నిమ్మకాయల సుధీర్, ఎస్.లావణ్య, పి.జయంతి, వి.నేతాజీ, జెసిఎస్ కన్వీనర్ జి.మాధవరావు, కో ఆప్షన్ సభ్యులు ఎం.వెంకట్రావు, కన్వీనర్లు గోళ్లు పద్మావతి, గోగు గాయత్రి, బోను ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.
కురుపాం : రాష్ట్రంలో జగనన్న సురక్ష కార్యక్రమంతో నూతన అధ్యాయానికి నాంది పలికిందని మండల కన్వీనర్ ఐ. గౌరీ శంకర్ అన్నారు.శుక్రవారం మండలంలో మొండెంఖల్ సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అర్హులైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఆర్.రమేష్ కుమార్, వైస్ ఎంపిపి రంగారావు, ఎంపిటిసి సభ్యులు వి.విద్యారాణి, మాజీ ఎంపిపి అనిమా ఇందిరా కుమారి, పంచాయతీ కార్యదర్శి వై. వెంకట నాయుడు, వైసీపీ నాయకులు ఐ.రామకష్ణ, సచివాలయ సిబ్బంది. వాలంటీర్లు పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని కె.వెంకటాపురం సచివాలయ పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్‌పిటిసి సభ్యులు ఎం.బాబ్జి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా 11 రకాల సేవలను ప్రజలకు ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి బి.రమణమ్మ, ఎంపిడిఒ శ్రీరాములునాయుడు, ఎంపిడిఒ ఎంఎస్‌ఎల్ ప్రసాద్, ఇఒపిఆర్‌డి కెకె వర్మ, సర్పంచ్ బుడితి శ్రీనివాసరావు, కన్వీనర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీరు,్ల ప్రజలు పాల్గొన్నారు










