Jun 04,2023 23:41

పథకాలపై అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి-గొలుగొండ:అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డికే దక్కు తుందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ అన్నారు. ఆదివారం నాలుగో రోజు గొలుగొండ మండలం ఏఎల్‌పురం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీ గడపకు వెళ్లి సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. అర్హత గల వారికి రాజకీయాలు, పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సిహెచ్‌.భాస్కర్‌నాయుడు, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపిపి గజ్జలపు మణికుమారి, ఎంపిడిఒ డేవిడ్‌రాజు, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ సుదీష్న, వెలుగు ఏపిఎం మంగ, మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, స్థానిక సర్పంచ్‌, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షులు లోచల సుజాత, స్థానిక ఎంపిటిసి బుల్లి ప్రసాద్‌, కృష్ణ, మండల యూత్‌ అధ్యక్షులు రామకృష్ణనాయుడు, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షులు పెదపూడి శివ, చోద్యం పిఎసిఎస్‌ అధ్యక్షులు కిలపర్తి పెద్దిరాజు, ఏఎంసి చైర్మన్‌ కొల్లు సత్యనారాయణ పాల్గొన్నారు.
ఐడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభం
ఐసిడిఎస్‌ గొలుగొండ ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో అవసరమైన కేంద్రాలకు పక్కా భవనాలను నిర్మించేందుకు నిధులు విడుదల చేస్తామని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన గొలుగొండలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఇప్పటివరకు నర్సీపట్నం ప్రాజెక్టులో భాగమైన గొలుగొండ నాతవరం మండలాలను గొలుగొండ ప్రాజెక్టుగా రెండు నెలల క్రితం ఐసిడిఎస్‌ వారు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోవడంతో అద్దె భవనాన్ని కార్యాలయంలో ఏర్పాటు చేసి ముస్తాబు చేశారు. ఈ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గొలుగొండ, నాతవరం మండలాల్లో 10 కేంద్రాలకు, అలాగే మండల కేంద్రాలయంలో ప్రాజెక్ట్‌ కార్యాలయానికి పక్కా భవనాలు అవసరమై ఉందని వాటికి నిధులు మంజూరయ్యే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఇప్పటికే మండలంలో పుత్తడిగైరంపేట, పేటమలపల్లి అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలను పూర్తి చేయడానికి జడ్పిటిసి నిధులను ఇప్పటికే కేటాయించామన్నారు.