May 28,2023 23:47

పథకాలను వివరిస్తున్న సుభద్ర, ఫాల్గుణ

ప్రజాశక్తి - పెదబయలు :మండలంలో సీతగుంట గ్రామంలో ఆదివారం అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ, ఉమ్మడి జిల్లా ఛైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర పర్యటించారు. గడప గడప కార్యక్రమంలో భాగంగా ఇంటింటా తిరిగారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకొన్నారు. గ్రామంలో మహిళలు బోర్‌వెల్‌, సిసి రహదారులు, డ్రైనేజ్‌ మంజూరు చేయాలని కోరారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉమ్మడి జిల్లా పరిషత్‌ ఛైర్పర్సన్‌ సుభద్ర మాట్లాడుతూ, గడప గడప కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ పి.మాధవరావు, ఎంపీటీసీ కే బొంజుబాబులు పలు సమస్యలు తెలియజేశారన్నారు. ఈ మేరకు నివేదికలు సిద్ధం చేయాలని ఎంపీడీఓ ఎల్‌,పూర్ణయ్య, పిఆర్‌ ఇంజినీర్‌ను ఆదేశించారు. ప్రభుత్వం అర్హులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కొర్ర రాజుబాబు, మండల కన్వీనర్‌ ఆనందరావు, అనంతరావు, వాలంటీర్లు పాల్గొన్నారు.