
ప్రజాశక్తి -చీడికాడ:మండలంలోని అర్జునగిరి గ్రామంలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, ఇంకా ఎవరికైనా పథకాలు అందకుంటే సమస్యలు తెలుసుకుని సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా చేసేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడపగడపకు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. కొంతమంది గ్రామ మహిళలు ఇళ్ల స్కీములు కావాలని మొరపెట్టుకోగా ఉప ముఖ్యమంత్రి తక్షణమే హౌసింగ్ విభాగానికి సంబంధించిన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రాన్ని, గ్రామ సచివాలయాన్ని, గ్రామ హెల్త్ క్లినిక్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ నారాయణమూర్తి, జెడ్పిటిసి లాలం శారద వరలక్ష్మి జానకిరామ్, గ్రామ సర్పంచ్ బోడాల రామలక్ష్మి శ్రీను, తహసిల్దార్ బివి రాణి, ఎంపీడీవో జయప్రకాష్, పార్టీ మండల కన్వీనర్ రాజబాబు వైసిపి నాయకులు ధర్మిశెట్టి కొండబాబు, చైతన్య, రమణబాబు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు
పథకాలపై ఎమ్మెల్యే గణేష్ ఆరా
నర్సీపట్నం టౌన్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం 22వ వార్డులో ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ పర్యటించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పథకాలపై ఆయన ఆరా తీశారు. ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను వెంటనే అధికారులతో చర్చించి పరిష్కార మార్గాలను చూపించారు. స్థానికులు రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం కొందరు కోరారు. జగనన్న సచివాలయాలు కన్వీనర్ 14వ వార్డు ఇన్చార్జ్ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ ఆయన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ సుబ్బలక్ష్మి, 22వ ఇంఛార్జి పెట్లా నాయుడు, అయ్యరక కార్పోరేషన్ డైరెక్టర్ కర్రి కనక మహాలక్ష్మి, షిరిడీ సాయి దేవస్థానం నిర్వాహకులు కర్రి రాంగోపాల్, సీనియర్ వైసీపీ నాయకుడు నాని, వైస్ చైర్మన్ లు తమరాన అప్పలనాయుడు, కోనేటి రామకృష్ణ, జగనన్న సచివాలయాల కన్వీనర్ తమరాన శ్రీను, మున్సిపల్ కౌన్సిలర్లు వీరమాచినేని జగదీశ్వరి, సిరసపల్లి నాని తదితరులు పాల్గొన్నారు.