ప్రజాశక్తి-ఎస్.రాయవరం:అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ పధకాలు అందేలా కృషి చేస్తున్నామని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు తెలిపారు. మండలంలోని పెదగుమ్ములూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతీ ఒక్కరికి పక్కా ఇళ్ళు మంజూరు చేశామని, అమ్మ ఒడి, రైతు భరోసా వంటి పధకాలు ప్రవేశపెట్టామని తెలిపారు. అర్హత ఉండి పధకాలు పొందని వారు ఎవరైనా ఉంటే నేరుగా తనని సంప్రదించవచ్చని, సత్వర న్యాయం చేకూరుస్తానని తెలిపారు. జగనన్న ప్రభుత్వంలో కుల మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా పధకాలు వర్తింప చేస్తున్నామని తెలిపారు.స్థానిక మహిళలను కలుసుకుని వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పధకాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీను రాజు, కిరణ్, బాబ్జి రాజు, లోవరాజు, రాజా రమేష్, శ్రీను, రాజు, చంటి, పార్టీ నాయకులు, స్థానిక అధికారులు, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.










