Dec 15,2022 00:15

మ్మెల్యే గొల్లబాబూరావు


ప్రజాశక్తి -ఎస్‌.రాయవరం:తారతమ్యాలు, రాజకీయ పార్టీలు అంటూ చూడకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికి పధకాలు అమలు చేస్తున్నది జగనన్న ప్రభుత్వమని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు కొనియాడారు. బుధవారం చిన్నగుమ్ములూరు గ్రామం లో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలకు అందుతున్న సంక్షేమ పధకాలపై ఆరా తీశారు. నవరత్నాల కరపత్రాలను ఇంటింటా పంపిణీ చేపట్టారు. అర్హులైతే పక్కా ఇళ్లు మంజూరు చేస్తున్నామని , పెన్షన్‌ లు, అమ్మఒడి తదితర పధకాలు అమలు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.