ప్రజాశక్తి-రేపల్లె: ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించేందుకే సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణారావు పేర్కొన్నారు. మండలంలోని ఉప్పూడి పంచాయ తీలో శనివారం జరిగిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మోపిదేవి పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిం చారు. ఈ సందర్భంగా ఎంపీ మోపిదేవి మాట్లా డుతూ గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా, ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా ప్రజలకు అందుతున్నాయని అన్నారు. నవరత్నాలను ప్రవేశపెట్టి వాటిని ఆర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని కొనియాడారు. ఎన్నికల హమీలను 98 శాతం పైగా అమలు చేసినట్లు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని వారి కష్టాలను తెలుసుకుని సమస్యలను పరిష్కరిం చేందుకు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బుడా చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, రూరల్ కన్వీనర్ గాదె వెంకయ్య బాబు, బసవయ్య అంటే నాగేంద్రమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యలవర్తి వెంకట్రావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










